ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి లో 48 మందికి కంటి పరీక్షలు

2చూసినవారు
ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి లో 48 మందికి కంటి పరీక్షలు
ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం కామారెడ్డి జిల్లా అంధత్వ నివారణ సంస్థ, బాన్సువాడ లయన్స్ కంటి ఆసుపత్రి సంయుక్తంగా ఉచిత మోతిబిందు నిర్ధారణ, కంటి పరీక్షలు నిర్వహించాయి. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీంద్ర మోహన్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రభుత్వ నేత్ర వైద్య సహాయ అధికారి బి. హరికిషన్ రావు కంప్యూటర్ ద్వారా 48 మందికి కంటి పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాస్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్