ఎల్లారెడ్డి మండలంలోని 31 గ్రామపంచాయతీల సర్పంచ్లకు, 246 వార్డు స్థానాలకు సోమవారం రెండో రోజు నామినేషన్లు జోరుగా జరిగినట్లు ఎంపీడీఓ తహెరా బేగం తెలిపారు. లక్ష్మాపూర్, తిమ్మారెడ్డి, వెల్లుట్ల, రుద్రారం, మత్తమాల, భిక్కనూర్ గ్రామపంచాయతీ కార్యాలయాల్లో, ఎంపీడీఓ కార్యాలయంలోని 2 క్లస్టర్ కేంద్రాల్లో సర్పంచ్ పదవికి 49, వార్డు సభ్యుల పదవికి 78 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ప్రక్రియ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు కొనసాగింది.