కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజల నుంచి 68 దరఖాస్తులు, ఫిర్యాదులు స్వీకరించారు. భూ, రెవెన్యూ, పింఛన్లు, ఉపాధి, సంక్షేమ పథకాలకు సంబంధించిన సమస్యలను ప్రజలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.