8. 50కోట్లతో వంతెనలు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

2చూసినవారు
8. 50కోట్లతో వంతెనలు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు
వర్షాకాలంలో కామారెడ్డి - ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలో లింగంపల్లి ఖుర్దు వద్ద వంతెన కొట్టుకుపోవడంతో, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చొరవతో వంతెన నిర్మాణం కోసం 4 కోట్ల రూపాయలు మంజూరు చేయించారని ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్ పర్సన్ రజిత వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ఇదే దారిలో అడవిలింగాల గేట్ సమీపంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద వంతెన నిర్మాణం కోసం 4.50 లక్షల రూపాయలు, రెండు హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం కోసం 8.50 కోట్ల రూపాయలు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేకు రైతులు, ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్