ఎల్లారెడ్డిలో కోతుల గుంపు బీభత్సం: భయాందోళనలో ప్రజలు

1చూసినవారు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో కోతుల బెడద తీవ్రమైంది. బుధవారం ఉదయం టీచర్స్ కాలనీలో కోతుల గుంపు స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. దాదాపు అరగంటపాటు ఇళ్ల వద్దే తిరుగుతూ ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు కలిగించాయి. నీళ్లు పోసినా, టపాసులు కాల్చినా అవి వెళ్లలేదు. మున్సిపాలిటీ చేపట్టిన కోతుల పట్టివేత కార్యక్రమం వాయిదా పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్