హైదరాబాదులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో గుండె ఆపరేషన్ చేయించుకుంటున్న 70 ఏళ్ల షేక్ మజారఉద్దీన్ అనే వృద్ధునికి అత్యవసరంగా 'ఓ పాజిటివ్' రక్తం అవసరమైంది. ఈ నేపథ్యంలో, కామారెడ్డికి చెందిన రక్తదాత చంద్రశేఖర్ రెడ్డి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి వృద్ధుడి ప్రాణాలను కాపాడారు. ఈ విషయాన్ని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు బుధవారం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది సకాలంలో రక్తం అందక ఇబ్బందులు పడుతున్నారని, వారి ప్రాణాలను కాపాడటానికి రక్తదాతలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.