కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇసాయిపేట్ గ్రామానికి చెందిన లక్ష్మీ నారాయణకు అత్యవసరంగా ఓ నెగిటివ్ రక్తం అవసరమైంది. ఈ నేపథ్యంలో, రెడ్డిపేట్ గ్రామానికి చెందిన ప్రశాంత్ గౌడ్ 11వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారు. ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ఈ విషయాన్ని తెలిపారు. ఏ, బి, ఏబి, ఓ నెగిటివ్ వంటి అరుదైన రక్త గ్రూపులు దొరకడం కష్టమని, ప్రతి ఒక్కరూ తమ రక్త గ్రూపును తెలుసుకొని ఉండాలని ఆయన సూచించారు.