ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలనీ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో శుక్రవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో వివిధ ప్రభుత్వ పథకాల అమలు, పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం, అభివృద్ధి పనుల పురోగతి, ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వీబీ–జీ రామ్ జీ పథకం కింద కూలీల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, అర్హులైన కూలీల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.