దత్తత సహాయ కేంద్రం ప్రారంభించిన అదనపు కలెక్టర్

3చూసినవారు
దత్తత సహాయ కేంద్రం ప్రారంభించిన అదనపు కలెక్టర్
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, అదనపు కలెక్టర్ మధుమోహన్ స్థానిక సంస్థల అధికారుల చేతుల మీదుగా దత్తత సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రం దత్తత ప్రక్రియలు, చట్టపరమైన నిబంధనలు, అవసరమైన పత్రాలు, కౌన్సెలింగ్‌పై పౌరులకు మార్గదర్శకత్వం అందిస్తుంది. దత్తత కోరుకునే తల్లిదండ్రులకు, కుటుంబాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి, శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఈ కేంద్రం బాలల సంక్షేమ సేవలను బలోపేతం చేయడానికి, దత్తత సేవల్లో పారదర్శకత తీసుకురావడానికి దోహదపడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్