కామారెడ్డి జిల్లా ఐడీఓసీ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ మీడియా కేంద్రాన్ని గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్/అదనపు ఎన్నికల అధికారి మధుమోహన్, రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ ప్రారంభించారు. రోజువారీ దినపత్రికలు, చానళ్లలో ప్రసారమయ్యే పెయిడ్ న్యూస్‌ను గుర్తించి, సంబంధిత రిజిస్టర్లలో నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల నియమావళి ప్రకారం మీడియా పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీపీ ఆర్ ఓ తిరుమల పాల్గొన్నారు.