ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థ సింహారెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ యువత బంగారు భవిష్యత్తుకు ఆధునిక సాంకేతిక విద్య అవసరమని అన్నారు. శనివారం ఆయన ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాల వద్ద నూతనంగా నిర్మించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) ను ప్రారంభించారు. తెలంగాణ సీఎం ఆదేశాల మేరకు, గ్రామీణ ప్రాంతాల యువత సాంకేతికంగా ఎదిగేందుకు రాష్ట్రంలోని అన్ని ఐటిఐ కళాశాలల స్థానంలో ATC సెంటర్లను ఏర్పాటు చేసి, హైదరాబాద్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారని తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.