ఎర్రారంలో శిథిలావస్థలో ఉన్న రోడ్డు బ్రిడ్జిని పరిశీలించిన ఏఈ

0చూసినవారు
ఎర్రారంలో శిథిలావస్థలో ఉన్న రోడ్డు బ్రిడ్జిని పరిశీలించిన ఏఈ
నాగిరెడ్డిపేట్ మండలంలోని ఎర్రారం గ్రామ శివారులో పోచారం కెనాల్ పై ఉన్న రోడ్డు వంతెన శిథిలావస్థకు చేరుకుంది ఇరిగేషన్ ఏఈ అక్షయ్ కుమార్, గ్రామ సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్ గౌడ్, గ్రామస్తులతో కలిసి మంగళవారం వంతెనను పరిశీలించారు. స్కూల్ బస్సులు, ఆటోల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుండటంతో, గ్రామస్తులు, సర్పంచ్ కలిసి వంతెనకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఏఈ మాట్లాడుతూ నూతన వంతెన నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని, ఈ సమస్యను ఎమ్మెల్యే మదన్ మోహన్ దృష్టికి తీసుకెళ్లి కొత్త వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని సర్పంచ్ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్