శుక్రవారం ఎఐబిఎస్ఎస్ (ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం) ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను సంఘం మండల ప్రధాన కార్యదర్శి సర్దార్ నాయక్, ఎల్లారెడ్డి డివిజన్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు కోల దాసీరాం నాయక్ ఆవిష్కరించారు. బంజారాల సంస్కృతి, సంప్రదాయాలు, సెలవు దినాలు, పండుగల వివరాలతో ఈ క్యాలెండర్ రూపొందించబడింది. బంజారా సోదరులంతా ఐకమత్యంతో ఉండి సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.