షబ్బీర్ అలీకై షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఎఐసీసీ

4చూసినవారు
షబ్బీర్ అలీకై షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఎఐసీసీ
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మహిళలపై వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ కు ఏఐసిసి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కామారెడ్డి సెగ్మెంట్లో షబ్బీర్ అలీ, టీపీసీసీ కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మధ్య వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే ఆయన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్తో పాటు కొందరు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఏఐసిసి వివరణ కోరినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్