బడి మెట్లు ఎక్కకుండానే గొప్ప కవిగా ఎదిగిన అందే శ్రీ

677చూసినవారు
బడి మెట్లు ఎక్కకుండానే గొప్ప కవిగా ఎదిగిన అందే శ్రీ
సోమవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో గొప్ప కవి అందెశ్రీ మృతికి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ వి. శంకరయ్య మాట్లాడుతూ, బడి మెట్లు ఎక్కకుండానే గొప్ప కవిగా ఎదిగిన మహోన్నత మానవతావాద కవి అందెశ్రీ అని కొనియాడారు. అనంతరం కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థులతో కలిసి డాక్టర్ అందెశ్రీ ఆకస్మిక మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్