ఎల్లారెడ్డిలో గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాదం పంపిణీ

0చూసినవారు
ఎల్లారెడ్డిలో గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాదం పంపిణీ
కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డిలోని టీచర్స్ కాలనీ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం 7వ రోజు అన్నప్రసాదం నిర్వహించారు. జక్సాని శ్రీనివాస్, సైకిల్ సంగయ్య దంపతులు ప్రత్యేక పూజలు చేయించగా, గతేడాది లడ్డూ ప్రసాదం స్వీకరించిన అనంతరం తమకు పాపాయి జన్మించడంతో కృతజ్ఞతగా శ్రీనివాస్ స్వంత ఖర్చులతో అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. కాలనీ మహిళలు భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. భక్తులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్