నాగిరెడ్డిపేట మండలం జప్తి జానకంపల్లిలో శనివారం ఆంజనేయ స్వామి దేవాలయ పంచమ వార్షికోత్సవం గ్రామ పురోహితులు ఋగ్వేద పండితులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హనుమాన్ విగ్రహానికి సింధూర లేపనం, పుణ్యాహవాచనము, గణపతి హోమం, పూర్ణాహుతి, ధ్వజారోహణము, అన్న ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలను వేదమంత్రాలతో నిర్వహించారు. ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.