ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామంలోని ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏపీఎం రామనారాయణ గౌడ్ తనిఖీ చేశారు. జిల్లాలో వర్ష సూచన ఉన్నందున, వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. కేంద్రంలో నిల్వ ఉన్న వరి బస్తాలను రైస్ మిల్లులకు తరలించే ప్రక్రియను పరిశీలించి, ధాన్యం రవాణాకు లారీల కొరత లేకుండా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా ఐకెపి సీసీ ఆయన వెంట ఉన్నారు.