ఎల్లారెడ్డి పట్టణంలోని కేజీబీ విద్యాలయంలో ఖాళీగా ఉన్న మహిళా స్కావెంజర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి వీణాబాయి తెలిపారు. ఆసక్తిగల మహిళా అభ్యర్థులు ఈ నెల 14, 15, 16 తేదీలలో కేజీబీ విద్యాలయంలో దరఖాస్తులను అందజేయాలి. పదవ తరగతి ఉత్తీర్ణులై, 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, పని అనుభవం ఉన్న మహిళలను తహశీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓల కమిటీ ఎంపిక చేస్తుంది.