కామారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన భూముల ఫోర్జరీ స్కాం కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ పత్రాలతో అక్రమంగా భూ రిజిస్ట్రేషన్లు చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించి, ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.