టీవిఎఈ. జేఎసీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి డివిజన్ లో ఆర్టిజన్, అనమాండ్ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది. విద్యుత్ శాఖలో ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ తో పాటు కన్వర్షన్ ఇవ్వాలని, అనమాండ్ కార్మికులకు టీజిఎస్పీ డిసీఎల్ కంపెనీ తరహాలో ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలని, పీస్ రేట్ వర్కర్లకు GO. NO. 11 ప్రకారం వేతనాలు వర్తింపజేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెకు స్టేట్ జేఎసీ కన్వీనర్ సంతోషం, కో-కన్వీనర్ ఎ. శ్రీకాంత్, కంపెనీ ఆర్గనైజేషన్ సెక్రటరీ విజయ్, ఉమ్మడి జిల్లా కన్వీనర్ హరికృష్ణ మద్దతు ప్రకటించారు.