ఆర్యవైశ్యులు సేవరంగంలో ముందుంటారు: ఎమ్మెల్యే

5చూసినవారు
శనివారం ఎల్లారెడ్డి పట్టణంలో జరిగిన ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులు సిద్ది శ్రీధర్ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే కే. మదన్ మోహన్ రావు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్యవైశ్యులు వ్యాపార రంగంతో పాటు సేవా రంగంలోనూ ముందుంటారని అన్నారు. అమెరికాలో ఉన్న ఎల్లారెడ్డికి చెందిన ఆర్యవైశ్యులను తానా సభల్లో కలిసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఆర్యవైశ్యులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా ఆర్య వైశ్య సంఘం ప్రతినిధి కంచర్ల కిషన్ నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్