మంగళవారం ఎల్లారెడ్డి మండలంలోని మాచపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రెజ్లింగ్ అండర్-14, 17 బాలుర, బాలికల పోటీలను ఆర్డీఓ పార్థసింహరెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాల నుంచి అండర్-14లో 120 మంది, అండర్-17 నుంచి 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, ఓడిపోయినవారు బాధపడకుండా గెలుపు కోసం ప్రయత్నం చేయాలని సూచించారు.