గాంధారిలో దారుణం.. బంగారం కోసం అత్తను హత్య చేసిన కోడలు

0చూసినవారు
గాంధారిలో దారుణం.. బంగారం కోసం అత్తను హత్య చేసిన కోడలు
గాంధారి మండలంలో బంగారంపై మోజుతో ఓ కోడలు తన అత్తను బండరాయితో కొట్టి హత్య చేసింది. ఈ ఘటన శనివారం రాత్రి సీతాయపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. రెండో కొడుకు భూమయ్య భార్య అయిన కోటవ్వ, తరచూ అత్త రుక్మవ్వ (73)తో డబ్బుల విషయంలో గొడవ పడుతూ ఉండేది. శనివారం తెల్లవారుజామున అత్తను హత్య చేసి డబ్బు, బంగారం దొంగిలించాలనే ఆలోచనతో రుక్మవ్వ తలపై కోటవ్వ బండరాయితో కొట్టగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఆమె మెడలో ఉన్న బంగారు గుండ్లు, చెవి కమ్మలు దొంగిలించి, చివరకు పోలీసులకు పట్టుబడింది. ఈ ఘటనపై ఎస్ఐ ఆంజనేయులు వివరాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్