ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్న రెండు బెల్టు షాపులపై పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 4,455/- విలువైన మద్యం స్వాధీనం చేసుకుని, యజమానులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ బొజ్జ మహేష్ తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.