అమ్మకు అక్షరమాల–ఉల్లాస్లో మహిళా అక్షరాస్యతపై అవగాహన

0చూసినవారు
ఎల్లారెడ్డిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం మహిళా వారోత్సవాల సందర్భంగా 'అమ్మకు అక్షరమాల ఉల్లాస్' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 11వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ శివరాములు మాట్లాడుతూ, మహిళల అక్షరాస్యతతోనే కుటుంబ, సమాజ, దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి మహిళ చదువుపై ఆసక్తి పెంచుకుని అక్షరాస్యతను పెంపొందించుకోవాలని, తద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితులు, పిల్లల భవిష్యత్తు మెరుగుపడతాయని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్