రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన బి టాపర్ స్కూల్ డ్రైవర్

3చూసినవారు
రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన బి టాపర్ స్కూల్ డ్రైవర్
కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రక్తహీనతతో బాధపడుతున్న సాగరిక అనే మహిళకు అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరమైంది. జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకుల సహకారంతో, బి టాపర్ స్కూల్ డ్రైవర్ షేక్ అజీమ్ పాషా సకాలంలో రక్తాన్ని అందించారు. ఎప్పుడైనా, ఎవరికైనా రక్తాన్ని అందించి ప్రాణాలను కాపాడటంలో ఈ సమితి రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోంది. డ్రైవర్లకే ఆదర్శంగా నిలిచిన అజీమ్‌ను జిల్లా రక్తధాతల సేవా సమితి ప్రతినిధులు ముదాం శ్రీధర్, శివకుమార్ అభినందించారు.

సంబంధిత పోస్ట్