ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12 వార్డులకు గాను 24 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసి, మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేస్తున్నారు. ఈనెల 11న జరుగనున్న ఎన్నికల కోసం జిల్లా కేంద్రం నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను మున్సిపల్ మేనేజర్ వాసంతి దగ్గరుండి, వార్డు అధికారులు, సిబ్బందితో శుభ్రం చేయించి, సీల్ వేసేందుకు సిద్ధం చేశారు. ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి తరలించడానికి బాక్సులను సిద్ధం చేశారు.