ఆరుగొండ సింగిల్ విండో చైర్మన్‌గా బండారు శ్రీనివాస్ రెడ్డి

754చూసినవారు
ఆరుగొండ సింగిల్ విండో చైర్మన్‌గా బండారు శ్రీనివాస్ రెడ్డి
తాడ్వాయి మండలం ఆరుగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సింగిల్ విండో) చైర్మన్‌గా బండారు శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషితో తనకు ఈ అవకాశం దక్కిందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన శ్రీనివాస్ రెడ్డి గతంలో గుండారం–ఎల్లారెడ్డిపల్లి ఎంపీటీసీగా పనిచేశారు. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం గుండారం, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల మధ్య సొసైటీ గోదాం నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. గతంలో ఎంపీటీసీగా ఉన్న సమయంలో గుండారం–మెదక్ మధ్య పెద్దవాగుపై ఎల్లాపూర్ తండా వద్ద రూ. 2 కోట్లతో వంతెన నిర్మాణానికి కృషి చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్