బాన్సువాడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి బదిలీ

0చూసినవారు
బాన్సువాడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి బదిలీ
శనివారం రాత్రి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, బాన్సువాడ సబ్ కలెక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయిని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బదిలీ చేశారు. దాదాపు రెండేళ్లపాటు బాన్సువాడ డివిజన్‌లో సబ్ కలెక్టర్‌గా పనిచేసిన కిరణ్మయి, విద్య, వైద్యం, రైతుల సమస్యల పరిష్కారంలో చురుగ్గా పాల్గొన్నారు. వరదల సమయంలో క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పరిష్కరించడంలోనూ, ఇటీవల నీటిట్యాంకు ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతిని ట్యాంకుపైకి వెళ్లి కౌన్సిలింగ్ చేసి ప్రాణాలను కాపాడటంలోనూ ఆమె తనదైన ముద్ర వేశారు. బాన్సువాడ డివిజనల్ పాలనావ్యవహారాల్లో ఆమె ప్రత్యేకతను చాటుకున్నారు.

ట్యాగ్స్ :