కామారెడ్డి జిల్లా కేంద్రంలో అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల నారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో ఆకాంక్షలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నేటికీ స్వరాష్ట్ర ఆకాంక్షలు, కొలవులు పూర్తిగా నెరవేరలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సుమలత, ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూర్యప్రసాద్, గవర్నమెంట్ ప్లీడర్ శ్యాంగోపాల్ రావు, అదనపు గవర్నమెంట్ ప్లీడర్ రజనీకాంత్ పాల్గొన్నారు.