సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎల్లారెడ్డి సిఐ. రాజిరెడ్డి అన్నారు. ఆయన సోమవారం నాగిరెడ్డిపేట మండలంలోని జలాల్పూర్ గ్రామంలో సైబర్ నేరాలపై కళాజాత బృందం వారిచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి పాలన కార్యక్రమంలో భాగంగా జిల్లా సూపర్డెంట్ పోలీస్ రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని తెలిపారు.