ఎల్లారెడ్డి - లింగంపేట్ మండలాల్లో ఎలుగు బంట్ల సంచారం

3చూసినవారు
కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి, లింగంపేట్ మండలాల గ్రామ శివారుల్లోని అటవీ ప్రాంతాల్లో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం, శనివారాల్లో లింగంపేట మండలం ముంబాజిపేట తండా, ఎల్లారెడ్డి మండలం వెలుట్ల గ్రామ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయ సమీప అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పశువుల కాపరులకు ఎలుగుబంటి కనిపించడంతో ఆ ప్రాంతంలో వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి, ఎలుగుబంట్లు గ్రామ పొలిమేరల్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్