ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణం పనులు ప్రారంభించాలి

0చూసినవారు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణం పనులు ప్రారంభించాలి
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణం పనులు ప్రారంభించాలని మున్సిపల్ కమిషనర్ ఎ. మహేష్ కుమార్ కోరారు. మున్సిపల్ ఆఫీసులో శనివారం జరిగిన సమావేశంలో, 12 వార్డుల్లో ఇళ్లు మంజూరైన కొందరు లబ్ధిదారులు ఇంకా పనులు మొదలుపెట్టలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం నిర్మాణ పనుల పురోగతిని బట్టి 5 లక్షల రూపాయలను విడతల వారీగా విడుదల చేస్తుందని కమిషనర్ వివరించారు.

సంబంధిత పోస్ట్