రూ. 151లకు భద్రాద్రి కళ్యాణ తలంబ్రాలు

2చూసినవారు
రూ. 151లకు భద్రాద్రి కళ్యాణ తలంబ్రాలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కార్గో డీఎం కిశోర్ సూచనల మేరకు, ఎల్లారెడ్డిలో భద్రాద్రి తలంబ్రాలకు సంబంధించిన కరపత్రాలను, గోడ ప్రతులను మున్సిపల్ చైర్మెన్ పద్మ శ్రీకాంత్, కౌన్సిలర్లు సిద్ది శ్రీధర్, తిరుపతి సమక్షంలో ఆవిష్కరించారు. రూ. 151 చెల్లిస్తే భద్రాద్రి కళ్యాణ తలంబ్రాలు కార్గో ద్వారా ఇంటికి పంపిస్తామని డీఎం తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భద్రాద్రి రాములవారి ఆశీస్సులు పొందాలని చైర్మన్ పద్మ శ్రీకాంత్ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత విద్యాసాగర్ కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్