ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఆదివారం జోరందుకుంది. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు, 12వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం ప్రారంభించింది. మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి, హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.