ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, 7, 8, 9, 10 వార్డుల్లో పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సీనియర్ నాయకులు దేవేందర్, మర్రి బాలకిషన్, మండల, పట్టణ అధ్యక్షులు నర్సింలు, రాజేష్, మాజీ అధ్యక్షులు హన్మండ్లు, సతీష్, గజేందర్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ నాయకులు ప్రజలను కలిసి మద్దతు కోరారు.