హిందు దేవిదేవతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బుధవారం ఎల్లారెడ్డి గాంధీ చౌక్ వద్ద బీజేపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రి బాలకిషన్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడటం పదవి అహంకారమని, ఆయన తన హిందుత్వాన్ని మరిచిపోతున్నారని, ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గుపడాలని అన్నారు. కుల రాజకీయాలు చేసే ముఖ్యమంత్రి నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు.