కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ గ్రామ శివారులో చెరువులో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని 35 నుండి 45 ఏళ్ళ మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలిని గుర్తించినవారు దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి, శనివారం కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, దర్యాప్తు చేపట్టారు.