ఎల్లారెడ్డి పట్టణ సమీపంలోని మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఫామ్ హౌస్ వద్ద సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు గులాబీ జెండాను ఆవిష్కరించి, 'జై తెలంగాణ, జై
కేసీఆర్' అంటూ నినాదాలు చేశారు. పట్టణ అధ్యక్షుడు సతీశ్ మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాటం చేసిందని, మాజీ సీఎం
కేసీఆర్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నర్సింలు, అరవింద్ గౌడ్, రాజు తదితరులు పాల్గొన్నారు.