జూన్ 4వరకు బీఆర్ఎస్ పార్టీ సెగ్మెంట్ స్థాయి సమావేశాలు

0చూసినవారు
జూన్ 4వరకు బీఆర్ఎస్ పార్టీ సెగ్మెంట్ స్థాయి సమావేశాలు
ఉమ్మడి జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ ఓటర్ రివిజన్ ప్రోగ్రామ్ పై పార్టీ నేతలకు, బూత్ సభ్యులకు, కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ వి. జి. గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సమావేశాలకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ స్పీకర్ హాజరవుతారు. ఎల్లారెడ్డిలో 30న, బోధన్ లో జూన్ 1న, నిజామాబాద్ అర్బన్ లో 3న, కామారెడ్డిలో 4న సమావేశాలు జరుగుతాయి. ఆర్మూర్, జుక్కల్ లో ఇప్పటికే సమావేశాలు పూర్తయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్