బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఎల్లారెడ్డి గాంధీ చౌక్ వద్ద శుక్రవారం బస్తీచలో అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారిని కలిశారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరించారు. బీజేపీ నేతలు మాజీ బత్తిని దేవేందర్, మండల అధ్యక్షులు నర్సింలు, పట్టణ అధ్యక్షులు రాజేష్, పట్టణ అధ్యక్షులు శంకర్, మాజీ ఎంపీపీ నక్క గంగాధర్ పాల్గొన్నారు.