ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బుధవారం ఎల్లారెడ్డిలోని ఏ హెల్త్ వేల్ నెస్ కేంద్రంలో వైద్యులు ఆరోగ్యకరమైన జీవనశైలితో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచించారు. క్యాన్సర్ వ్యాధి, దాని నివారణ మార్గాల గురించి వివరించారు. ధూమపానం, అతిగా మద్యం సేవించడం క్యాన్సర్‌కు కారణమవుతాయని తెలిపారు. కొంతమంది ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తున్నప్పటికీ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మత్తమాల పిహెచ్సి హెల్త్ సూపర్ వైజర్ రాణి, ఎఎన్ఎం సుధ, ఎంఎల్హెచ్ పి. సచిన్, ఆశవర్కర్ పాల్గొన్నారు.