సర్పంచ్‌పై అవమానకర పోస్టు పెట్టిన యువకుడిపై కేసు నమోదు

2చూసినవారు
సర్పంచ్‌పై అవమానకర పోస్టు పెట్టిన యువకుడిపై కేసు నమోదు
ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ సర్పంచ్ పాలకుర్తి స్రవంతిపై, ఆమె భర్త సాయిగౌడ్‌పై నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్న వార్డు మెంబర్ ఎండి నజీర్‌పై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ. మహేష్ తెలిపారు. గ్రామ వాట్సాప్ గ్రూపులో సర్పంచ్‌ను ఉద్దేశించి అవమానకరమైన సందేశాలు పోస్ట్ చేసినట్లు, ఈ విషయమై వివరణ కోరినప్పుడు బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్పంచ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :