30 ఏళ్ల తర్వాత మైనారిటీ కాలనీలో సీసీ రోడ్లు

3చూసినవారు
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 7వ వార్డు పరిధిలోని మైనారిటీ కాలనీలో మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక చొరవతో మూడు దశాబ్దాల తర్వాత తమ కాలనీలో రోడ్ల నిర్మాణం చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు, చైర్మన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ 
కార్యక్రమంలో వైస్ చైర్మన్ భాగ్యవతి, కమిషనర్ జగ్జీవన్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్