ఆలయాల ఆవరణలో చోరీలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాలు అరికట్టే అవకాశం ఉంటుందని, ఎల్లారెడ్డి ఎస్ఐ బొజ్జ మహేష్ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండాలోని ఆలయంలో చోరీ స్థలాన్ని పరిశీలించిన ఆయన, తాండ ప్రజలకు సీసీ కెమెరాల పై అవగాహన కల్పించారు. ఈ ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. కెమెరాలు వల్ల భద్రత ప్రమాణాలు మెరుగవుతాయని ఆలయ నిర్వాహకులకు సూచించారు.