సోమవారం కామారెడ్డి జిల్లా ఆడిట్ అధికారిగా సీహెచ్. బలరాం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. కలెక్టర్ బలరాం కు శుభాకాంక్షలు తెలిపి, ఉద్యోగంలో నీతి నిజాయితీతో పనిచేస్తే ప్రజల మన్ననలు పొందవచ్చని సూచించారు.