ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని టీచర్స్ కాలనీలో చిన్నారులు ప్రతీ మంగళవారం రాత్రి 7 గంటలకు ఆంజనేయ చిత్రపటం ముందు దీపం వెలిగించి, పూజలు చేసి హనుమాన్ చాలీసా పఠిస్తున్నారు. ఆటపాటలతో కాలక్షేపం చేసే ఈ చిన్నారులు, ఈ క్రమశిక్షణతో జీవితంలో మంచి మార్పు, క్రమశిక్షణ నేర్చుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు పిల్లలను మంచి మార్గంలో నడిపిస్తాయని పలువురు ప్రశంసిస్తున్నారు.