
యూఏఈకి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఇరాన్ దాడుల నేపథ్యంలో యూఏఈ తన రక్షణ కోసం ఇజ్రాయెల్ అధునాతన ఐరన్ డోమ్ వ్యవస్థను, సైనిక బృందాలను ఆశ్రయించింది. యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయెల్ తన దేశ సరిహద్దుల వెలుపల ఐరన్ డోమ్ను మోహరించడం ఇదే తొలిసారి. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య విశ్వాసాన్ని పెంచి, భవిష్యత్ సహకారాలకు మార్గం సుగమం చేసిందని అమెరికా మీడియా సూచిస్తోంది.




