కామారెడ్డిలో సిగరెట్ దిష్టిబొమ్మ దహనం

5చూసినవారు
కామారెడ్డిలో సిగరెట్ దిష్టిబొమ్మ దహనం
ఇండియన్ డెంటల్ అసోసియేషన్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ నో టొబాకో డే సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా దంత వైద్యులు నిజాంసాగర్ చౌరస్తా నుండి మున్సిపల్ ఆఫీస్ మీదుగా ర్యాలీ నిర్వహించి, సిగరెట్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఐడీఏ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు డాక్టర్ అచుకట్ల జీవన్, పొగాకు, గుట్కా, సిగరెట్ అలవాట్ల వల్ల యువత జీవితాలు అర్ధాంతరంగా ముగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ సాజిద్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్